Donald Trump: కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రంప్ విజయం
- ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిన కరోనా
- ట్రంప్ ఓటమి బాటలో ఉండడానికి ఇది కూడా ఓ కారణమని వాదన
- విచిత్రంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో 93 శాతం ట్రంప్ సొంతం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కరోనా వైరస్ ప్రచారాస్త్రంగా మారింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విరుచుకుపడ్డారు. ట్రంప్ మాత్రం తాము సమర్థంగా ఎదుర్కొన్నామని, దేశ ప్రజలను కరోనా మహమ్మారి నుంచి రక్షించగలిగామని చెప్పుకొచ్చారు.
నిజానికి ట్రంప్ ఓటమి అంచున నిలవడం వెనక కరోనా పాత్ర ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. మొత్తం 376 ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండగా, అందులో 93 శాతం ప్రాంతాల్లో ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిన డకోటా, మొంటానా, నెబ్రా్కా, విస్కాన్సిన్, అయోవాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ ట్రంప్‌కే ఓటేశాయి.