Goa: డబ్బులు ఇవ్వాలంటూ గోవా ముఖ్యమంత్రికి అసభ్య, బెదిరింపు మెసేజ్‌లు

Goa police lodge case after CM Pramod Sawant gets threatening SMS

  • ప్రమోద్ కుమార్ సావంత్‌కు బెదిరింపు సందేశాలు
  • అంతర్జాతీయ నంబరు నుంచి వస్తున్నట్టు గుర్తింపు
  • గతంలోనూ ఓ మంత్రికి ఫోన్ చేసి రూ. 3 కోట్లు ఇవ్వాలని బెదిరింపు

ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేశాడు. డబ్బులు కావాలంటూ మెసేజ్‌లతో బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గోవాలో జరిగిందీ ఘటన. ఓ అంతర్జాతీయ నంబరు నుంచి ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్‌కు అసభ్యకర, అవమానకర, బెదిరింపు సందేశాలు పంపుతూ డబ్బుల కోసం బెదిరింపులకు దిగాడు. ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, తమకు అందిన సందేశాలను మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం బయటపెట్టలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు +5732038836 నంబరు నుంచి ఆ మెసేజ్ వచ్చినట్టు గుర్తించారు.

ఈ ఏడాది జనవరిలో గోవా పీడబ్ల్యూడీ మంత్రి దీపక్ పౌస్కార్‌కు కూడా ఇలాంటి మెసేజ్‌లే వచ్చాయి. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. తొలుత ఆయనకు ఫోన్ చేసిన నిందితుడు తనకు రూ. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 

  • Loading...

More Telugu News