Minor Girl: ఆ అబ్బాయినే పెళ్లాడుతా... హోర్డింగ్ ఎక్కి హడలగొట్టిన మైనర్ బాలిక!

Girl climbs hording for lover In Indore Pardesipura

  •  ప్రేమికుడిని అక్కడికి తీసుకొచ్చిన పోలీసులు 
  • తల్లి తన ప్రేమను అంగీకరించడంలేదంటూ అమ్మాయి నిరసన
  • అబ్బాయి సాయంతో అమ్మాయిని కిందికి దించిన పోలీసులు

మధ్యప్రదేశ్ లో ఓ మైనర్ బాలిక ప్రేమించిన బాలుడి కోసం హోర్డింగ్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. ఇండోర్ నగరంలోని పర్దేశిపుర ప్రాంతంలోని భండారీ బ్రిడ్జి వద్ద ఓ బాలిక హోర్డింగ్ ఎక్కడాన్ని స్థానికులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలికను కిందికి దించే ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలిక ససేమిరా అంది. తాను ప్రేమించిన బాలుడితో వివాహానికి అంగీకరించే వరకు దిగేది లేదని స్పష్టం చేసింది.

బాలుడితో పెళ్లికి తన తల్లి ఒప్పుకోవడంలేదని, తల్లి ఒప్పుకోకపోయినా సరే బాలుడితో పెళ్లి చేయాల్సిందేనని ఆ అమ్మాయి పోలీసులకు  తెలిపింది. దాంతో పోలీసులు ఆమె ప్రేమించిన కుర్రాడ్ని పట్టుకొచ్చి ఆమె ముందు నిలిపారు. దాంతో సంతృప్తి చెందిన ఆ బాలిక హోర్డింగ్ పైనుంచి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పర్దేశిపుర పోలీస్ ఇన్ స్పెక్టర్ అశోక్ పాటిదార్ ఈ వివరాలను మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News