Ramcharan: సోషల్ మీడియాలో రామ్ చరణ్ సరికొత్త రికార్డు

Ram Charan sets new record on social media
  • మార్చిలో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్ 
  • 233 రోజుల్లో పది లక్షల మంది ఫాలోవర్లు
  • ఇంత వేగంగా మిలియన్ ఫాలోవర్లు రికార్డు  
ఈవేళ సోషల్ మీడియా అకౌంట్ అనేది అందరికీ సాధారణం అయిపోయింది. సోషల్ మీడియాలో అకౌంట్ లేని వాళ్లు చాలా తక్కువనే చెప్పచ్చు. అంతలా ఈ సామాజిక మాధ్యమాలు ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి.

ఇక సినిమా వాళ్లకి అయితే చెప్పేక్కర్లేదు. వీటిని చక్కగా వినియోగించుకుంటున్న వాళ్లలో సినీ తారలు ముందుంటారు. తమ కొత్త చిత్రాల విశేషాలను, షూటింగు కబుర్లను, వ్యక్తిగత వివరాలను ఫొటోలతో సహా పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ వుంటారు.

ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ ట్విట్టర్ లో తాజాగా ఓ రికార్డు కొట్టాడు. అతితక్కువ కాలంలో మిలియన్ (పది లక్షలు) ఫాలోవర్లను సాధించిన టాలీవుడ్ స్టార్ గా చరణ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్ లో అకౌంటును ప్రారంభించిన చరణ్, 233 రోజుల్లో పది లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఇంత వేగంగా ఈ మార్కును సాధించిన వారు టాలీవుడ్ లో ఎవరూ లేరని అంటున్నారు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ కి ఇదొక ఉదాహరణగా చెబుతున్నారు.    
Ramcharan
Social Media
Twitter

More Telugu News