Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో చతికిలబడిన కాంగ్రెస్... సంబరాలు చేసుకుంటున్న బీజేపీ

Madhya Pradesh by polls

  • మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
  • 20 స్థానాల్లో బీజేపీ జోరు
  • 7 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీఎస్పీ పైచేయి

మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇవాళ ఓట్ల లెక్కింపు కాగా, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మొరెనా నియోజకవర్గంలో బీఎస్పీది పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ లో తమదే హవా కావడంతో మధ్యప్రదేశ్ బీజేపీ శ్రేణులు సంబరాలు ప్రారంభించాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ నేతలు, కార్యకర్తలు వేడుకలు షురూ చేశారు.

అయితే, మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారులోని ముగ్గురు మంత్రులు తమ ప్రత్యర్థులకన్నా వెనుకబడి ఉండడం గమనార్హం. సుమావోలి నియోజకవర్గంలో ఐదాల్ సింగ్ కన్సానా, దిమాని నియోజకవర్గంలో గిరిరాజ్ దండోత్, మెహగావ్ నియోజకవర్గంలో ఓపీఎస్ భదోరియా వెనుకంజలో ఉన్నారు. అటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింథియా ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News