Shilpa Singh: మెడలో తాళిబొట్టు ధరించే మహిళలను కుక్కలతో పోల్చిన మహిళా ప్రొఫెసర్

Goa assistant professor comments on Mangalasutra triggered anger

  • గోవా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ తీవ్ర వ్యాఖ్యలు
  • భగ్గుమన్న హిందుత్వ సంఘాలు
  • పనాజీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

హిందూ మహిళలకు దాంపత్య జీవనంలో మంగళసూత్రం పరమ పవిత్రమైనది. స్త్రీకి వివాహిత హోదా అందించేది ఈ తాళిబొట్టే. అయితే తాళిబొట్టు వేసుకునే మహిళల పట్ల ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. గోవాలోని వీఎం సాల్గావ్ కర్ న్యాయవిద్య కళాశాలలో శిల్పా సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె తన ఫేస్ బుక్ పేజీలో మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మెడలో మంగళసూత్రం ధరించే మహిళలను గొలుసులతో కట్టేసిన కుక్కలతో పోల్చారు.

దీనిపై రాష్ట్రీయ హిందు యువ వాహిని గోవా విభాగానికి చెందిన రాజీవ్ ఝా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన భావాలను ప్రొఫెసర్ శిల్పా సింగ్ కావాలనే అవమానించారని ఆరోపించారు. ఆమెపై పనాజీ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సెక్షన్ 295 (ఏ) కేసు నమోదు చేసుకున్నారు. కాగా, ఆమెను సస్పెండ్ చేయాలని కాలేజీ యాజమాన్యాన్ని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News