Pentagon: పెంటగాన్ కీలక అధికారి జేమ్స్ అండర్సన్ రాజీనామా
- మార్క్ ఎస్పర్‌ను ట్రంప్ తొలగించిన తర్వాతి రోజే ఘటన
- పెంట్‌హౌస్‌లో వివాదాస్పద వ్యక్తులకు స్థానం కల్పిస్తుండడంపై కినుక
- యూనిఫాంలో దేశానికి సేవ చేసినందుకు గర్వంగా ఉందన్న జేమ్స్
రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ను అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించిన మరుసటి రోజే పెంటగాన్‌లో కీలక అధికారిగా ఉన్న డిఫెన్స్ పాలసీ కార్యదర్శి జేమ్స్ హెచ్ అండర్సన్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
జేమ్స్ రాజీనామాతో వైట్‌హౌస్ వివాదాస్పద మాజీ జనరల్ ఆంథోని టాటాకు ఉన్నత స్థానానికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. జేమ్స్ రాజీనామాను అమెరికా రక్షణ శాఖ అధికారి ధ్రువీకరించారు. యూనిఫాంలో దేశానికి సేవ చేసినందుకు గర్వంగా ఉందని జేమ్స్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. వివాదాస్పద వ్యక్తులను పెంటగాన్‌లో అధికార స్థానాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడంతోనే జేమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.