Supreme Court: అర్నాబ్ ను విడుదల చేయండి... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Supreme Court says give interim bail to Arnab

  • బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన అర్నాబ్
  • అర్నాబ్ కు అనుకూలంగా సుప్రీం తీర్పు
  • రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు
  • ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని ముంబయి సీపీకి స్పష్టీకరణ

ఓ ఇంటీరియర్ డిజైనర్ ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఆయనను మధ్యంతర బెయిల్ పై విడుదల చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆర్నాబ్ భావజాలం ఎలాంటిదైనా వ్యక్తి స్వేచ్ఛను హరించడం సబబు కాదని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

కాగా, ఈ కేసులో బాంబే హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అర్నాబ్ గోస్వామి సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News