Steering Committee: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం 18 మందితో స్టీరింగ్ కమిటీ
- కరోనా వ్యాక్సిన్ కోసం కొనసాగుతున్న పరిశోధనలు, ట్రయల్స్
- వచ్చే ఏడాది జనవరి నాటికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం
- పంపిణీ కోసం కసరత్తులు షురూ చేసిన ఏపీ సర్కారు
కరోనా మహమ్మారిని తుదముట్టించే వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ సాగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు ముందే జాగ్రత్త పడుతోంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి పలు వ్యాక్సిన్ లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని భావిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం 18 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.
వ్యాక్సిన్ అందించడంలో రూపొందించాల్సిన విధివిధానాలపై ఈ కమిటీ కసరత్తులు చేయనుంది. వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తే మొట్టమొదట వైద్య, ఆరోగ్య సిబ్బందికి అందిస్తామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.