Rahul Gandhi: ఆర్థికమాంద్యంలోకి భారత్.. మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్
- భారత్ మాంద్యంలోకి జారుకుందన్న పంకజ్ కుమార్
- 'ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్' ఆర్టికల్ లో కీలక వ్యాఖ్యలు
- మోదీ తీసుకున్న చర్యలే కారణమన్నరాహుల్ గాంధీ
భారత్ ఆర్థికమాంద్యంలోకి జారుకుంటోందని ఆర్బీఐ అధికారి పంకజ్ కుమార్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సాంకేతికంగా ఇప్పటికే దేశం మాంద్యంలోకి జారుకుందని మానిటరీ పాలసీ డిపార్ట్ మెంట్ ప్రతినిధి పంకజ్ కుమార్ తాను రాసిన 'ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్' ఆర్టికల్ లో పేర్కొన్నారు. అయితే దశలవారీగా దేశ ఆర్థిక కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొస్తే పరిస్థితి మరింత దిగజారకుండా చూడొచ్చని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. చరిత్రలోనే తొలిసారి ఆర్థికమాంద్యంలోకి ఇండియా జారుకుందని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్ల బలంగా ఉన్న భారత్... బలహీనంగా మారిపోయిందని విమర్శించారు. దీంతో పాటు వార్తాపత్రికల్లో వచ్చిన స్క్రీన్ షాట్లను ఆయన షేర్ చేశారు.