Sensex: లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్ల మొగ్గు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

Sensex closes 466 points low

  • 236 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 58 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా నష్టపోయిన ఎస్బీఐ షేర్

వరుసగా ఎనిమిది సెషన్ల పాటు లాభాల్లో కొనసాగి, సరికొత్త రికార్డులను టచ్ చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ స్టాకుల్లో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 466 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత కొంత మేర పుంజుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 43,357కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 12,690 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.89%), ఐటీసీ (1.43%), ఎల్ అండ్ టీ (1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.06%), టెక్ మహీంద్రా (0.81%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.16%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.91%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.41%),  ఎన్టీపీసీ (-2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.10%).

  • Loading...

More Telugu News