Priest: అన్నవరం హుండీ లెక్కింపులో పురోహితుడి చేతివాటం... శాశ్వతంగా వేటు వేసిన అధికారులు

Annavaram priest caught stealing money from temple Hundi

  • అన్నవరం ఆలయంలో ఘటన
  • రూ.11 వేలు నగదు ఎత్తుకెళుతున్న పురోహితుడు
  • తనిఖీల్లో పట్టుకున్న ఆలయ భద్రతా సిబ్బంది

తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని సత్యదేవుని ఆలయంలో పురోహితుడి చేతివాటం వెల్లడైంది. ఆలయ హుండీ లెక్కింపులో పురోహితుడు శ్రీనివాస శర్మ నగదు, కానుకలు కొట్టేస్తున్నట్టు గుర్తించారు. ఈ పురోహితుడు హుండీ నుంచి రూ.11 వేల వరకు నగదు తీసుకెళుతుండగా ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీల్లో పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన ఆలయ ఈవో పురోహితుడు శ్రీనివాస శర్మను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News