Shankar: కూతురు పెళ్లి పనులలో బిజీగా వున్న దర్శకుడు శంకర్!

Director Shankar busy with his daughters wedding arrangements
  • త్వరలో పెద్దమ్మాయి అదితి శంకర్ వివాహం 
  • అభిప్రాయ భేదాలతో ఆగిన 'ఇండియన్ 2'
  • దక్షిణాది హీరోలతో మల్టీ స్టారర్ ప్లానింగ్  
  • ఇప్పటికే యశ్, విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్  
కమలహాసన్ కథానాయకుడుగా 'ఇండియన్ 2' చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ప్రస్తుతం సినిమా పనులను పక్కన పెట్టి.. వ్యక్తిగత పనులలో బిజీ అయ్యాడు. ఆయన పెద్దమ్మాయి అదితి శంకర్ కు త్వరలో వివాహం జరగనుంది. దాంతో ప్రస్తుతం ఆయన ఆ పెళ్లి పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోపక్క, 'ఇండియన్ 2' చిత్రం షూటింగుకి బ్రేక్ పడింది. చిత్రం బడ్జెట్ బాగా తగ్గించమని నిర్మాత కోరాడనీ, అయితే, దర్శకుడు దానికి ససేమిరా అన్నాడనీ ఇటీవల వార్తలొచ్చాయి. దాంతో వీరి మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపి, చిత్రం షూటింగ్ ఆగిపోయేలా చేశాయి. షూటింగును ప్రారంభించేది, లేనిదీ వెంటనే తేల్చాలని శంకర్ చిత్ర నిర్మాతకు లేఖ ద్వారా అల్టిమేటం ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో శంకర్ మరో సినిమాని ప్రారంభించే ప్రయత్నాలలో వున్నారు. దక్షిణాది హీరోలతో ఓ మల్టీ స్టారర్ చేసే ఉద్దేశంతో ఆయన వున్నారు. ఇందులో నటించడానికి కన్నడ నటుడు, 'కేజీఎఫ్' ఫేమ్ యశ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగు నుంచి కూడా ఓ యంగ్ హీరోని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కూతురు వివాహం అయ్యాక ఈ మల్టీస్టారర్ పై శంకర్ పూర్తి స్థాయిలో దృష్టిపెడతాడట.
Shankar
Kamal Hassan
Indian 2

More Telugu News