Jagan: రేపు ఉదయం గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

CM Jagan will meet governor tomorrow
  • ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ కు వెళ్లనున్న సీఎం
  • గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు చెప్పనున్న జగన్ 
  • రాష్ట్ర పరిణామాలపై చర్చించే అవకాశం
ఏపీ సీఎం జగన్ రేపు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళతారు. త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో చర్చించనున్నారు. గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇతర ముఖ్యాంశాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించనున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు వివిధ అంశాల్లో ప్రభుత్వ పనితీరును గవర్నర్ కు నివేదించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ వ్యవహారం కూడా సీఎం జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళతారని తెలుస్తోంది.
Jagan
Governor
Biswabhusan Harichandan
Diwali
Raj Bhavan
Andhra Pradesh

More Telugu News