Gutta Jwala: విష్ణు వాళ్ల నాన్న డీజీపీగా పనిచేశారు: గుత్తా జ్వాల

Gutta Jwala talks about her boyfriend Vishnu Vishal
  • తమిళ నటుడు విష్ణువిశాల్ ప్రేమలో జ్వాల
  • ఇద్దరికీ ఆమధ్య జరిగిన నిశ్చితార్థం
  • కెరీర్ పై ఆసక్తే తామిద్దరినీ కలిపిందన్న జ్వాల
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణువిశాల్ మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. తమ ప్రేమపై గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తామిద్దరికీ తమ కెరీర్ అంటే ప్రాణమని, కెరీర్ పై ఉన్న అనురక్తే తామిద్దరినీ కలిపిందని వివరించారు. తాను ప్రస్తుతం బ్యాడ్మింటన్ అకాడమీ స్థాపించి, దాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని, విష్ణు విశాల్ చిత్రరంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలని పరితపిస్తున్నాడని జ్వాల తెలిపారు.

విష్ణు నటించిన కొన్ని చిత్రాలు ఇటీవల విజయవంతం అయ్యాయని, అతను నటించిన 'రాచ్చసన్' చిత్రం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఓ రకంగా ప్రస్తుత సమయం తామిద్దరికీ కెరీర్ పరంగా ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇద్దరం కృషిని నమ్ముతామని, అందుకే పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకుంటామని అన్నారు.

విష్ణు వాళ్ల తండ్రి డీజీపీగా పనిచేశారని, ఆయన ఇటీవలే రిటైరయ్యారని జ్వాల వెల్లడించారు. తండ్రి బాటలోనే విష్ణు కష్టాన్నే నమ్ముకున్నాడని తెలిపారు. ఇక, తమ పెళ్లి గురించి చెబుతూ, తామిద్దరికి నిశ్చితార్థం అయిందని, పెళ్లి ఈ ఏడాది ఉండదని స్పష్టం చేశారు. ఆ శుభ సమయం ఎప్పుడో తాను తప్పకుండా వెల్లడిస్తానని జ్వాల పేర్కొన్నారు.
Gutta Jwala
Vishnu Vishal
DGP
Badminton
Kollywood

More Telugu News