Statue: అరుదైన జాతి కుక్కకు బంగారు విగ్రహం చేయించిన దేశాధ్యక్షుడు
- కుక్కలను ఇష్టపడే టర్క్ మెనిస్థాన్ అధ్యక్షుడు
- అలబాయ్ జాతి శునకాలపై ప్రత్యేక అభిమానం
- రాజధాని యాష్గబట్ లో విగ్రహావిష్కరణ
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు కుక్కకు సైతం బంగారు విగ్రహం వెలిసింది మరి! టర్క్ మెనిస్థాన్ దేశాధ్యక్షుడు గుర్బంగులీ బెర్డిముఖమెదోవ్ కు శునకాలంటే ఎంతో ప్రేమ. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన అరుదైన అలబాయ్ జాతి కుక్కలను ఆయన అమితంగా ఇష్టపడతారు. అందుకే ఆ కుక్క జాతి గుర్తుగా బంగారు విగ్రహం చేయించారు. దేశ రాజధాని యాష్గబట్ లో ఓ ప్రసిద్ధ కూడలిలో ఆ అలబాయ్ కుక్క స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు గుర్బంగులీ విగ్రహావిష్కరణ చేసి ఆ జాగిలం పట్ల తన మక్కువ చాటుకున్నారు. కాగా, విగ్రహం కింది భాగంలో ఓ ఎలక్ట్రానిక్ తెర కూడా ఏర్పాటు చేశారు. దానిపై అలబాయ్ జాతి కుక్కలకు చెందిన వీడియోలు చూడొచ్చు.