Byreddy Siddharth Redd: నందికొట్కూరు వైసీపీలో విభేదాలు.. బైరెడ్డి ఆగ్రహం

Real party workers not getting justice says Byreddy Siddharth Reddy
  • నియోజకవర్గంలో ముదురుతున్న వర్గ పోరు
  • ఆర్థర్, బైరెడ్డి మధ్య విభేదాలు
  • నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్న బైరెడ్డి
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆర్థర్, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల మధ్య తొలి నుంచి విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు గ్రూపుల మధ్య వివాదం ఎన్నోసార్లు రచ్చకెక్కింది. గతంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో కూడా రెండు వర్గాలు సై అంటే సై అనుకున్నాయి. ఇప్పుడు మళ్లీ వివాదం రాజుకుంది. జగన్ పాదయాత్రను చేపట్టి మూడేళ్లు గడిచిన సందర్భంగా నందికొట్కూరులో ర్యాలీ, పటేల్ సెంటర్ లో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని అన్నారు. మధ్యలో వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. వీరివల్ల అసలైన కార్యకర్తలు నష్టపోతున్నారని చెప్పారు. ఇద్దరు, ముగ్గురు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లాలో పెద్ద నాయకులం అనుకునేవారు పద్ధతి మార్చుకోవాలని... తమ నియోజకవర్గంలో వేలు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Byreddy Siddharth Redd
Nandikotkur
YSRCP

More Telugu News