Chandrababu: పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం: చంద్రబాబు

chandra babu slams ycp

  • పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే
  • మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉంది
  • సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోంది
  • బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది
  • విద్యావ్యవస్థను వైసీపీ సర్కారు నిర్వీర్యం చేసింది 

దీపావళి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ‘చీకట్లను పారద్రోలే వెలుగుపూల దీపావళి తెలుగువారి లోగిళ్లలో ఆనంద దీపావళి కావాలి. రాష్ట్రంలో అటు కరోనా కల్లోలం, ఇటు వరుస వరద విపత్తులతో అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారు. పాలకులు అవినీతి కుంభకోణాలతో, లక్షల కోట్ల అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆశావహ దృక్పథం ఒక్కటే మన జీవితాలలో వెలుగులు నింపుతుంది’ అని చంద్రబాబు అన్నారు.

‘అప్పులు తెచ్చి, అవినీతి పనులతో సొంత జేబులు నింపుకోవడం కాకుండా సమాజంలో సంపద సృష్టించే ఆలోచనలు పాలకులకు రావాలని... పరిశ్రమలు తెచ్చి ప్రజలకు జీవనోపాధి మార్గాలు పెంచే దిశగా వారి మనసులు మారాలని దీపావళి సందర్భంగా కోరుకుందాం. ఈ దీపావళి మీ ఇంట శుభాలు పూయించాలని కోరుకుంటూ.. మీ ఇంటిల్లిపాదికీ పండుగ శుభాకాంక్షలు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే. మానవాళి భవితవ్యం వాళ్ల చేతుల్లోనే ఉందని అన్నారు అబ్రహాం లింకన్. అంటే ప్రస్తుతం మనం మంచి పనులు చేస్తే.. రేపటి సమాజాన్ని కూడా మంచిగా ఉంచే బాధ్యతను పిల్లలు తీసుకుంటారన్నది లింకన్ ఉవాచ’ అని చెప్పారు.  
 
‘మన రాష్ట్రంలో పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం. తల్లిదండ్రులతో కలిసి బిడ్డల సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోంది. బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ ఇలాగే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోంది’ అని చెప్పారు.
 
‘చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉజ్వల భవిష్యత్తు ఉండేలా... యూనివర్సిటీలకు, పారిశ్రామిక వేత్తలకు, కంపెనీలకు వారధిగా మన విద్యావ్యవస్థను గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో తీర్చిదిద్దాం’ అని తెలిపారు.  

‘అలాంటిది ఇప్పుడు అటు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇటు పరిశ్రమలను వాటాల కోసం బెదిరించి వెళ్ళగొట్టి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరం. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి.. రేపటి పౌరుల గురించి బాధ్యతగా ఆలోచించినప్పుడే అబ్రహం లింకన్, జవహర్ లాల్ నెహ్రూ వంటి నేతలు కలలుగన్న సమాజం సిద్ధిస్తుంది. చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News