Diwali: రజనీకాంత్ ఇంట దీపావళి వేడుకలు... కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపిన తలైవా

Diwali celebrations at Rajinikanth house
  • నేడు దీపావళి
  • టపాసులు కాల్చుతూ సందడి చేసిన రజనీకాంత్
  • ఫొటోలను పంచుకున్న రజనీ కుమార్తె
దేశవిదేశాల్లో అభిమానులను కలిగివున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలారోజుల తర్వాత దర్శనమిచ్చారు. ఇవాళ తన నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చుతూ ఉల్లాసంగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను రజనీ కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇటీవల అనారోగ్యం పాలయ్యారంటూ తలైవాపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తన కుటుంబంతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకుంటూ దర్శనమివ్వడం అభిమానుల్లో ఆనందోత్సాహాలు కలిగిస్తోంది. తమిళ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రజనీకాంత్... భార్య లత, కుమార్తె సౌందర్య, అల్లుడు, మనవడితో కలిసి టపాసులు కాల్చి సందడి చేశారు.
Diwali
Rajinikanth
Celebrations
Soundarya
Chennai

More Telugu News