Teaspoon: ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ నంతా పోగు చేస్తే ఓ టీస్పూనులో సరిపోతుందట!

Australian mathematician says the whole corona virus fits in teaspoon

  • ఆస్ట్రేలియా గణిత నిపుణుడి ఆసక్తికర వ్యాఖ్యలు
  • ప్రపంచంలోని కరోనా క్రిముల పరిమాణం 8 ఎంఎల్
  • స్పూనులో పట్టేంత వైరస్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందన్న నిపుణుడు

చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్ రక్కసి ఇప్పుడు ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం తీవ్ర కుదుపులకు లోనయ్యాయంటే ఇది ప్రజల ఆరోగ్యంపైనే కాదు, సామాజిక, ఆర్ధిక జీవనంపైనా ఏవిధంగా ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో, గణితంతో మ్యాజిక్కులు చేసే మాట్ పార్కర్ అనే ఆస్ట్రేలియా నిపుణుడు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ మొత్తాన్ని పోగు చేస్తే అది ఓ టీస్పూనులో సరిపోతుందని పార్కర్ చెబుతున్నాడు.

ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మొత్తం పరిమాణం మహా అయితే 8 ఎంఎల్ ఉంటుందని, ఓ టీస్పూనులో 6 ఎంఎల్ పడుతుందని వివరించాడు. కరోనా వైరస్ కణం చాలా చిన్నదని, అయితే ప్రపంచవ్యాప్తంగా 53 మిలియన్ల కేసులు వచ్చిన నేపథ్యంలో తాను గణించిన మేరకు అది ఓ స్పూనుకు కొంచెం ఎక్కువ ఉంటుందేమో అని వ్యాఖ్యానించారు. ఓ టీస్పూన్ వైరస్ తో ఇంత పెద్ద ప్రపంచం కష్టపడుతోందని అన్నారు.

కాగా, కరోనా వైరస్ కణం మానవ కణాల కంటే పది లక్షల రెట్లు చిన్నది. ఆ లెక్కన ఇప్పుడున్న కేసుల ఆధారంగా ప్రపంచంలో 3.3 మిలియన్ బిలియన్ల కొవిడ్-19 కణాలు ఉన్నాయని మాట్ పార్కర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News