Sanchaita: 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి... ఏపీ సర్కారు ఆదేశాలు
- మాన్సాస్, సింహాచలం చైర్ పర్సన్ గా ఉన్న సంచయిత
- ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్
- ప్రభుత్వ సిఫారసు మేరకు నిర్ణయం
- గతంలో ఇదేరీతిలో బాధ్యతలు నిర్వహించిన ఆనంద గజపతిరాజు
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న పూసపాటి రాజ వంశీకురాలు సంచయిత గజపతికి ఏపీ సర్కారు కీలక బాధ్యతలు అప్పగించింది. తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు ఆమెను చైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
గతంలో సంచయిత తండ్రి ఆనంద గజపతిరాజు కూడా ఇదేవిధంగా సింహాచలం దేవస్థానంతో పాటు జిల్లాలోని 104 ఆలయాలకు చైర్మన్ గా వ్యవహరించారు. ఆనంద గజపతి వారసురాలిగా సంచయితకు అదేరీతిలో ఇతర ఆలయాల బాధ్యతలను అప్పగించాలని ఏపీ సర్కారు గత నెల 27న దేవాదాయశాఖకు లేఖ రాసింది. ఈ క్రమంలో నవంబరు 2న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి సంచయిత నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.