China: చైనాలో హీరోగా మారిన బ్రిటన్ దౌత్యాధికారి... వీడియో ఇదిగో!

Britain Depolmat is hero in China

  • కౌన్సిల్ జనరల్ గా పని చేస్తున్న స్టీఫెన్ ఎల్లిసన్
  • నదిలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన వైనం
  • బ్రిటన్ కాన్సులేట్ అధికారిక పేజీల్లో ప్రకటన

బ్రిటన్ కు చెందిన ఓ దౌత్యాధికారి, ఇప్పుడు చైనాలో హీరో అయ్యారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్ తెచ్చుకుని వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఘటనను చైనా ప్రభుత్వంతో పాటు, బీజింగ్ లో ఉన్న బ్రిటన్ దౌత్య కార్యాలయం, చోంగ్ క్వింగ్ లోని బ్రిటన్ మిషన్ తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాయి. కౌన్సిల్ జనరల్ గా పని చేస్తున్న స్టీఫెన్ ఎల్లిసన్ (61), వీకెండ్ లో ఎంజాయ్ చేస్తున్న వేళ, కన కళ్ల ముందు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న చైనా మహిళను, నదిలో దూకి మరీ కాపాడారు.

ఈ ఘటన జోంగ్ షాంగ్ సమీపంలో జరిగింది. ఓ నది వద్ద ఎంతో మంది పర్యాటకులు సేద దీరుతున్న వేళ, అదే నగర సందర్శన నిమిత్తం వచ్చిన ఎల్లీసన్ అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఓ మహిళ నదిలో పడిపోయింది. ఆమె తల నీటిలో మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వేళ, ఎల్లీసన్, వెంటనే నీటిలోకి దూకారు. "సమయానికి రక్షించడంతో ఆ మహిళ వెంటనే కోలుకుని ఊపిరి పీల్చుకుని, స్పృహలోకి వచ్చింది" అని బ్రిటన్ కాన్సులేట్ తన అధికారిక వెబ్ పేజీలో పేర్కొంది.

ఈ ఘటన మొత్తాన్ని, మహిళ నీటిలో పడిపోక ముందు నుంచే ఓ యువకుడు వీడియో తీశాడు. చైనా మీడియా సైతం ఇప్పుడు ఎల్లీసన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఎల్లీసన్ బ్రిటన్ మొత్తం గర్వపడేలా వ్యవహరించారని యూకే డిప్లొమాటిక్ మిషన్ వ్యాఖ్యానించింది. ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు. 

  • Loading...

More Telugu News