Rajnath Singh: గురితప్పని 'క్యూఆర్ సామ్'... డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్ నాథ్

Union defense minister Rajnath Singh appreciates DRDO on QRSAM success
  • నవంబరు 13న తొలి 'క్యూఆర్ సామ్' ప్రయోగం
  • నేడు రెండో ప్రయోగం నిర్వహించిన డీఆర్డీఓ
  • రెండు ప్రయోగాలు విజయవంతం అంటూ హర్షం వ్యక్తం చేసిన రాజ్ నాథ్
భారత్ కొన్నిరోజుల వ్యవధిలోనే రెండుసార్లు 'క్యూఆర్ సామ్' (క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్) ప్రయోగాలు నిర్వహించింది. ఇవాళ చేపట్టిన రెండో పరీక్ష కూడా విజయవంతం అయింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు.

వెంటవెంటనే జరిపిన రెండు ప్రయోగాలను దిగ్విజయం చేశారని కొనియాడారు. మొదట ఈ నెల 13న జరిపిన ప్రయోగంతో లక్ష్యాన్ని నేరుగా తాకడం ద్వారా రాడార్, మిస్సైల్ సామర్థ్యాలు నిరూపితమయ్యాయని, నేడు జరిపిన పరీక్షతో క్షిపణి లక్ష్య సామీప్యతను గుర్తించే క్రమంలో వార్ హెడ్ సత్తా వెల్లడైందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
Rajnath Singh
QRSAM
DRDO
Missile

More Telugu News