Nimmagadda Ramesh: ఏపీ అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దయిన వైనం!

nimmagadda collectors meet cancel

  • జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ ప్రయత్నాలు
  • స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించాలని యోచన
  • అధికారులకు సీఎస్ నుంచి అనుమతి రాని వైనం

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడాలని భావిస్తున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై  ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. అయితే, ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాయగా, వారు సమావేశంలో పాల్గొనలేదు.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. అయినప్పటికీ, సీఎస్ నుంచి అధికారులకు అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఆ వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. దీంతో సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని అందులో కోరినట్లు తెలిసింది.

అయినప్పటికీ, సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఈ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి  రద్దు అయ్యింది. వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది.

  • Loading...

More Telugu News