Monica Shetty: భారత సంతతి ఫిజీ మహిళను చంపిందెవరో చెబితే రూ.3 కోట్ల నజరానా ఇస్తామంటున్న ఆస్ట్రేలియా పోలీసులు
- 2014లో సిడ్నీ సమీపంలో మోనికా శెట్టీపై యాసిడ్ దాడి
- చికిత్స పొందుతూ మృతిచెందిన మహిళ
- ఇప్పటికీ హంతకులను గుర్తించలేకపోయిన పోలీసులు
ఆరేళ్ల కిందట ఆస్ట్రేలియాలో హత్యకు గురైన ఓ భారత సంతతి ఫిజీ మహిళ కేసు అక్కడి పోలీసులకు సవాల్ గా మారింది. 2014లో సిడ్నీకి సమీపంలో మోనికా శెట్టీ (39) అనే నర్సుపై యాసిడ్ పోసి కడతేర్చారు. యాసిడ్ దాడిలో మోనికా తీవ్రగాయాలపాలైంది. అక్కడి చిట్టడవిలో దాదాపు పదిరోజుల పాటు ఆమె గాయాలతో పడివుంది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదకు కన్నుమూసింది. దీనిపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు హంతకులు ఎవరన్నది తెలుసుకోలేకపోయారు. దాంతో మోనికా శెట్టీపై యాసిడ్ పోసిందెవరో చెబితే రూ.3 కోట్లు నజరానా ఇస్తామని ప్రకటించారు.