Varla Ramaiah: కనీస జ్ఞానం లేని వారు రాజకీయాల్లో ఉండకూడదు అని చట్టం చేయండి: వర్ల రామయ్య

varla slams jagan

  • హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి బెంచ్ ఆఫీస్‌గా మారిందంటున్నారు
  • వెంటనే ఆ ఎంపీపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టి అరెస్టు చేయండి
  • అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలు కట్టడి చేసి రాష్ట్రాన్ని కాపాడాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కోర్టులపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ‘కనీస జ్ఞానం లేని వారు రాజకీయాల్లో ఉండకూడదు అని చట్టం చేయండి. లేక పోతే, హైకోర్టు ఒక రాజకీయ పార్టీకి బెంచ్ ఆఫీస్‌గా మారింది అనే ఎంపీలు కూడా వస్తారు. వెంటనే ఆ ఎంపీపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టి అరెస్టు చేయండి. అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలు కట్టడి చేసి రాష్ట్రాన్ని కాపాడాలి’ అని ఆయన పేర్కొన్నారు.

కరోనా విజృంభణ అంతగా లేదని అంటూ, మళ్లీ కరోనా ఉందని స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదా వేయాలని వారు అంటున్నారని వర్ల రామయ్య విమర్శించారు. ‘కరోనా భయం లేదు, మీ బిడ్డలను బడికి పంపించమని ఆదిములం సురేశ్ గారు చెబితే, ముఖ్యమంత్రి గారు కరోనా వుంది, ఎన్నికలు వద్దు అంటారు. ఏమిటీ మతలబు? మీ పగ, రాష్ట్ర ప్రజల మీదా? లేక నిమ్మగడ్డ రమేశ్ పైనా? రాగ ద్వేషం మీకు పూర్తిగా పోలేదు సార్’ అంటూ వర్ల రామయ్య దెప్పిపొడిచారు.

  • Loading...

More Telugu News