Governor: యూనివర్సిటీలకు వీసీల నియామకం ఫైల్ ను తిప్పి పంపిన ఏపీ గవర్నర్!
- 20 రోజుల పాటు పెండింగ్ లో ప్రభుత్వ దస్త్రం
- న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్
- ఆపై వెనక్కు పంపిన వైనం
ఆంధ్రప్రదేశ్ లో వివిధ యూనివర్శిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమిస్తూ, పంపిన దస్త్రాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించకుండానే తిప్పి పంపారు. దాదాపు 20 రోజుల పాటు తన కార్యాలయంలో ఈ ఫైల్ ను పెండింగ్ లో పెట్టుకున్న గవర్నర్, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం వెనక్కు పంపినట్టు తెలుస్తోంది.
ఆచార్య నాగార్జున, ఆంధ్రా, రాయలసీమ, శ్రీ కృష్ణ దేవరాయ, శ్రీ వెంకటేశ్వర, ద్రవిడ యూనివర్శిటీలకు వీసీలను నియమించిన జగన్ సర్కారు, ఒక్కో వర్శిటీకి ఒక్కో పేరును మాత్రమే సిఫార్సు చేస్తూ గవర్నర్ ఆమోదం నిమిత్తం దస్త్రాన్ని పంపినట్టు సమాచారం. ఈ కారణంతోనే బిశ్వభూషణ్ ఫైల్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది.