Ashish Chandil: ఈ యువకుడి గురించి తెలిస్తే ఇదెలా సాధ్యం అంటారు!

Ashish Chandil of Madhyapradesh suffers with unidentified decease

  • 18 నెలలుగా మలమూత్ర విసర్జనకు వెళ్లని యువకుడు
  • ఇతర సమస్యలేవీ లేని వైనం
  • డాక్టర్లకే అంతుబట్టని రోగం

మనుషుల్లోనూ, ఇతర జీవుల్లోనూ మలవిసర్జన అనేది అత్యంత ముఖ్యమైన జీవక్రియ. కొందరిలో మలబద్ధకం, ఇతర కారణాలతో కొన్నిరోజుల పాటు ఈ ప్రక్రియ జరగకపోవచ్చు. కానీ, మధ్యప్రదేశ్ కు చెందిన ఆశిష్ (16) అనే యువకుడు ఏకంగా 18 నెలల నుంచి టాయిలెట్ కు వెళ్లలేదంటే నమ్మశక్యం కాదు. అతడిలో మలమూత్ర విసర్జనలు ఆగిపోయాయంటే విస్మయం కలుగుతుంది. కానీ ఇది నిజం!

ఒకట్రెండు రోజులు టాయిలెట్ కు వెళ్లకపోతేనే కడుపులో ఉబ్బరించినట్టుగా ఉంటుంది. కానీ ఆశిష్ ఒకటిన్నర సంవత్సరం నుంచి టాయిలెట్ కు వెళ్లకపోయినా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకపోవడం వైద్యశాస్త్రానికే సవాల్ లా నిలిచింది.

ఆశిష్ స్వస్థలం మధ్యప్రదేశ్ లోని మురౌనా జిల్లా. అయితే కొన్నాళ్లుగా మలమూత్ర విసర్జనకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎన్ని వైద్యపరీక్షలు చేసినా జబ్బేమిటో కనుక్కోలేకపోయారు. ఆశిష్ ప్రతిరోజు 20 వరకు చపాతీలు తింటాడట. టాయిలెట్ కు వెళ్లకపోవడం తప్ప అతనిలో మరే ఇతర సమస్యలు లేకపోవడం వైద్యులకే అంతుచిక్కడం లేదు. ఇదేదో వింత వ్యాధి అని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News