RBI: సోషల్ మీడియాలో వరల్డ్ రికార్డు సాధించిన ఆర్బీఐ

RBI set world record by getting one million followers in Twitter
  • ఆర్బీఐ ట్విట్టర్ ఖాతాకు 10 లక్షల మంది ఫాలోవర్లు
  • గతేడాది నుంచి ఫాలోవర్ల సంఖ్యలో విపరీతమైన పెరుగుదల
  • తర్వాత స్థానంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్
సోషల్ మీడియాలో భారత ప్రభుత్వ పెద్దలే కాదు, ప్రభుత్వ సంస్థలు కూడా తమ తడాఖా చూపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఫాలోవర్ల పరంగా ప్రపంచస్థాయిలో దూసుకెళుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా అరుదైన ఘనత అందుకుంది. ట్విట్టర్ లో ఆర్బీఐ 10 లక్షల మంది ఫాలోవర్ల సంఖ్యను అధిగమించింది.

ప్రపంచంలో మరే బ్యాంకుకు ఇంతమంది ఫాలోవర్లు లేరు. ఆఖరికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కూడా మన ఆర్బీఐ తర్వాతే. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుకు ట్విట్టర్ లో 6.67 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు 5.91 లక్షల మంది ట్విట్టర్ ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచింది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఉద్యోగులను ప్రశంసించారు.

ఆర్బీఐ ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన సమయంలో పెద్దగా ఫాలోవర్లు లేరు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఫాలోవర్ల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైంది. 3.42 లక్షల నుంచి 7.50 లక్షలకు పెరిగింది. ఇక మార్చిలో లాక్ డౌన్ ప్రకటించాక ఆర్బీఐ ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య మరింత పెరిగి మిలియన్ మార్కుకు చేరింది.
RBI
Followers
Record
Twitter
US Federal Reserve

More Telugu News