sriti hassan: అవుట్ డోర్ షూటింగుకి పోటెత్తిన జనం.. లొకేషన్ నుంచి వెళ్లిపోయిన శ్రుతిహాసన్!‌

sriti hassan leaves from set
  • ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో నటిస్తోన్న శ్రుతి
  • 'లాభం' అనే తమిళ సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనాలు
  • కరోనా వ్యాప్తి భయంతో వెళ్లిపోయిన శ్రుతిహాసన్
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'లాభం' అనే తమిళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి సెట్ నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడమే ఇందుకు కారణం.  

ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో చిత్రీకరణ జరిగే చోటుకి వచ్చారు. దీంతో శ్రుతిహాసన్‌.. షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితుల్లో జనాలు భారీగా రావడంతో కొవిడ్-19 వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండడంతో శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కరోనా వల్ల ప్రతి ఒక్కరికీ ప్రమాదం ఉందని, ప్రోటోకాల్స్‌ ఫాలో కాని తరుణంలో ఒక మహిళగా, సినీ నటిగా పలు నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని ఇటీవలే ఆమె ట్వీట్ చేసింది.
sriti hassan
Tollywood
Tamilnadu

More Telugu News