Depression: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం... చెన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతం

 Depression continues in Southeast Bay Of Bengal

  • చెన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం
  • ఈ నెల 25న తీరం దాటే అవకాశం
  • ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా, ఈ వాయుగుండం తుపానుగా మారితే ఇరాన్ ప్రతిపాదించిన మేరకు 'నివర్' అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశలో 550 కిమీ దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిమీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది క్రమేపీ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 25 మధ్యాహ్నం కారైక్కాల్, మామల్లపురం వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News