Netflix: ఆలయంలో అభ్యంతరకర సన్నివేశాలు.. నెట్ ఫ్లిక్స్ పై కేసు నమోదు

Case filed against Netflix

  • నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'ఏ సూటబుల్ బోయ్'
  • హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కేసు
  • ఎఫ్ఐఆర్ లో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ల పేర్లు

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇటీవల కాలంలో పలు వివాదాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో వివాదం ఆ సంస్థను చుట్టుముట్టింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'ఏ సూటబుల్ బోయ్' వెబ్ సిరీస్ వివాదాస్పదంగా మారింది. ఓ ఆలయ ప్రాంగణంలో ముద్దు సన్నివేశాలను చిత్రీకరించడంపై ఆరోపణలు వచ్చాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవిత్ర ఆలయ ప్రాంగణంలో అసభ్యకరమైన సన్నివేశాలను చిత్రీకరించారంటూ నెట్ ఫ్లిక్స్ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదైంది.

నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ లు... కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంబికా ఖురానాల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ వివరాలను మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు. మరోవైపు ఆ సన్నివేశాలను తొలగించాలని, హిందువులకు క్షమాపణ చెప్పాలని భారతీయ యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ డిమాండ్ చేశారు.

దీనిపై నెట్ ఫ్లిక్స్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ వెబ్ సిరీస్ లో సినీనటి టబు కూడా నటించింది. కొన్ని సన్నివేశాలలో టబు కూడా హాట్ గా నటించడం చర్చినీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News