IYR Krishna Rao: కొన్ని సందర్భాల్లో ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వ్యక్తి బండి సంజయ్: తాజా పరిణామాలపై ఐవైఆర్ వ్యాఖ్యలు

IYR Krishna Rao comments on Bandi Sanjay counter to Akbaruddin Owaisi remarks
  • ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చాలన్న అక్బర్
  • దారుస్సలాం భవనాన్ని కూల్చేస్తామన్న బండి సంజయ్
  • ప్రత్యర్థిని బట్టి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్న ఐవైఆర్
హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించగా, ఆ పని చేస్తే రెండు గంటల్లోనే నీ దారుస్సలాం భవనాన్ని కూల్చుతాం అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలపై ఏపీ బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

ప్రత్యర్థి భాషను బట్టి, రెచ్చగొట్టే విధానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నిర్మొహమాటంగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది సరిగా అవగాహన చేసుకున్న వ్యక్తి బండి సంజయ్ అని కొనియాడారు. లేకపోతే సంస్కారాన్ని బలహీనతగా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
IYR Krishna Rao
Bandi Sanjay
Akbaruddin Owaisi
NTR
PV Ghat
GHMC Elections
Hyderabad

More Telugu News