Kriti Kharbanda: ఏడాదిన్నరగా డేటింగ్ లో ఉన్నాం: కృతి కర్బందా

Kriti Kharbanda reveals that she is in relationship with Pulkit Samrat
  • నటుడు పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో కృతి కర్బందా
  • ఇద్దరి అభిప్రాయాలు కలిశాయన్న కృతి
  • ప్రస్తుతం తమ దృష్టి కెరీర్ పైనే అని వ్యాఖ్య
హీరోయిన్ కృతి కర్బందా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో ఉంది. వీరి అఫైర్ కు సంబంధించిన వార్తలు బీటౌన్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కృతి స్పందిస్తూ ఈ వార్తలన్నీ నిజమేనని తెలిపింది.

పులకిత్ మంచి వ్యక్తి అని, ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని, అందువల్లే ఇద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామని కృతి చెప్పింది. గత ఏడాదిన్నరగా డేటింగ్ లో ఉన్నామని తెలిపింది. ప్రస్తుతం ఇద్దరి దృష్టి కెరీర్ పైనే ఉందని... అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోబోమని చెప్పింది. తమ లక్ష్యాలను చేరుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామని తెలిపింది. కృతి తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. 'తీన్ మార్', 'బ్రూస్ లీ', 'ఒంగోలు గిత్త' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
Kriti Kharbanda
Pulkit Samrat
Bollywood
Tollywood

More Telugu News