Arnab Goswami: అర్నాబ్ గోస్వామి తాత్కాలిక బెయిలు పొడిగించిన సుప్రీంకోర్టు

Supreme Court extends bail of Goswamy

  • ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని చెప్పలేము
  • ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారు
  • వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం తీవ్రమైన నేరం

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. గోస్వామి తాత్కాలిక బెయిల్ ను మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం తెలిపింది. ఆర్కిటెక్ట్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారనే ఆరోపణలతో నమోదైన కేసులో గోస్వామి అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకునే విధంగా గోస్వామి ప్రేరేపించినట్టు చెప్పలేమని అన్నారు. గోస్వామిపై ఉన్న ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని చెప్పారు. తన అధికారాన్ని ఉపయోగించడంలో బాంబే హైకోర్టు విఫలమైందని అన్నారు. ఏ వ్యక్తికైనా సరే ఒక్కరోజు వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం కూడా తీవ్రమైన విషయమేనని చెప్పారు. క్రిమినల్ చట్టాలు ప్రజలను వేధించే సాధనంగా మారకూడదని అన్నారు.

  • Loading...

More Telugu News