Bonda Uma: 18 నెలల కాలంలో అనేక తుపాన్లు వచ్చినా ఒక్క రూపాయి రాల్చిన పాపానపోలేదు: బోండా ఉమ
- ఏపీని కుదిపేసిన నివర్
- గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎవర్నీ ఆదుకోలేదన్న ఉమ
- వరద బాధితులకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్
నివర్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. 18 నెలల కాలంలో అనేక తుపానులు వచ్చాయని, అనేక రకాలుగా నష్టం వాటిల్లినా ప్రభుత్వం ఒక్క రూపాయి రాల్చిన పాపానపోలేదని విమర్శించారు. రైతులందరినీ ఆదుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఫలితం శూన్యమని వ్యాఖ్యానించారు. ఒక్క మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ, అధికారులు కానీ ఎవరూ క్షేత్రస్థాయిలో పర్యటించలేదని ఆరోపించారు.
గతంలో వరదల్లో నష్టపోయిన వారికి రూ.500 ఇస్తామంటే కనీసం రూ.5000 ఇవ్వాలని ప్రకటన చేసిన జగన్, ఇప్పుడెందుకు రూ.500 ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు రూ.500 ఏంటి?... రూ.5 వేలు ఇవ్వాల్సిందే అని బోండా ఉమ డిమాండ్ చేశారు.