Congress: ఫొటోతో విరుచుకుపడిన రాహుల్ గాంధీ.. వీడియోతో రిప్లై ఇచ్చిన బీజేపీ

BJP IT Cell replay to Rahul gandhi tweet

  • పంజాబ్ రైతుపై లాఠీ ఎత్తిన పోలీసు ఫొటోను షేర్ చేసిన రాహుల్
  • జవాను కాస్తా కిసాన్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడని ఆవేదన
  • ఆ రైతును పోలీసులు తాకలేదంటూ బీజేపీ వీడియో

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. ఓ వృద్ధ రైతుపై లాఠీ ఎత్తినట్టు ఉన్న ఆ ఫొటోను ట్వీట్ చేసిన రాహుల్.. ఇది చాలా బాధాకరమైన చిత్రమని ఆవేదన వ్యక్తం చేశారు. మనది ‘జై జవాన్, జైకిసాన్’ మన నినాదమని, కానీ ఈ రోజు ప్రధాని మోదీ అహంకారం వల్ల జవాను రైతుకు వ్యతిరేకంగా నిలబడ్డాడని పేర్కొన్నారు.

రాహుల్ సోదరి, కాంగ్రెజ్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి ఫొటోలే తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. బీజేపీ బిలియనీర్ ఫ్రెండ్స్‌కు ఢిల్లీలో రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంటే, రైతులు వస్తుంటే రోడ్లపై గుంతలు తవ్వేస్తున్నారని విమర్శించారు.  

కాగా, రాహుల్ షేర్ చేసిన ఫొటోపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ఓ వీడియోను పోస్టు చేశారు. రాహుల్ ఫొటోను ‘ప్రచారం’గా పేర్కొన్న ఆయన ఆ రైతును పోలీసు కనీసం తాకను కూడా లేదని పేర్కొన్నారు. అంతేకాదు, రాహుల్‌ను దేశంలోనే అపఖ్యాతి పాలైన నాయకుడిగా అమిత్ అభివర్ణించారు.

  • Loading...

More Telugu News