Corona Virus: జులై నాటికి 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్: ఐసీఎంఆర్

30 crore people get vaccine before july

  • ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం కూడా టీకా తయారీ
  • దేశంలో 24 వ్యాక్సిన్ తయారీ యూనిట్లు
  • 19 కంపెనీలు కలిసి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి
  • ఐదు టీకాల క్లినికల్ ట్రయల్స్  

వచ్చే ఏడాది జులై నాటికి భారత్‌లోని 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) చీఫ్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ సమావేశంలో వర్చువల్ పద్ధతితో ఆయన మాట్లాడుతూ.. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

భారత్‌లో దేశ ప్రజల కోసమే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం కూడా టీకా తయారీ అవుతోందని చెప్పారు. దేశంలో 24 వ్యాక్సిన్ తయారీ యూనిట్లు, 19 కంపెనీలు కలిసి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో మాస్కుల పాత్ర ఎంతో ఉంటుందని, ప్రస్తుతం ఐదు టీకాల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

వాటిలో రెండు భారత్‌లో తయారవుతున్నాయని, మిగతా  3 విదేశాలకు చెందినవని అమిత్ షా తెలిపారు.  కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ సరిపోదని, కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు.  నిబంధనలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని తెలిపారు.


  • Loading...

More Telugu News