Bandla Ganesh: కవిత గారూ, నేను జోకర్‌ను కాదు.. ఫైటర్‌ని: బండ్ల గణేశ్

Actor Bandla Ganesh Slams MLC Kavitha over remarks on him
  • ఎన్నికల ప్రచారంలో బండ్ల గణేశ్‌ను జోకర్ అన్న కవిత
  • ఇప్పుడు బండి సంజయ్ ఆయనను మించిపోయాడంటూ సెటైర్లు
  • తాను రాజకీయాల్లో లేనంటూ కవితకు గణేశ్ కౌంటర్
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ క్యారెక్టర్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ డివిజన్ లో పాదయాత్ర చేసిన కవిత మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు బండ్ల గణేశ్ అనే వ్యక్తి ప్రజలను కడుపుబ్బా నవ్వించాడని, ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అతడిని మించిపోయాడని, పూటకో మాట, రోజుకో వేషం వేస్తూ కమెడియన్‌లా మాట్లాడుతూ ప్రజలను నవ్విస్తున్నాడని అన్నారు.

కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్.. తాను జోకర్‌ను కాదని, ఫైటర్‌ను అని పేర్కొన్నారు. ‘‘కవితగారూ, నేను జోకర్‌ను కాదు. ఫైటర్‌ను. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను. వాటిలో తలదూర్చాలని కూడా అనుకోవడం లేదు. మీకు ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశారు.
Bandla Ganesh
K Kavitha
TRS
GHMC
Hyderabad

More Telugu News