Potula Sunitha: టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాకు ఆమోదం తెలిపిన మండలి చైర్మన్!

Potula Sunetha Resignation Accepted by Mandali Chairman

  • గత నెలలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
  • అన్ని వర్గాల ప్రజలకూ మేలు చేస్తున్న జగన్
  • మద్దతుగా నిలవాలని భావించానన్న సునీత

గత నెలలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా నేత పోతుల సునీత, తన లేఖను మండలి చైర్మన్ షరీఫ్ కు పంపగా, నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజీనామాను షరీఫ్ ఆమోదించారు. కాగా, సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నందునే ఆయనకు మద్దతుగా నిలవాలని భావించానని, అందుకే తెలుగుదేశం పార్టీని వీడానని సునీత వ్యాఖ్యానించారు.

కాగా, ఈ శీతాకాల సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 19 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీటిల్లో పోలవరం ప్రగతి, గత ప్రభుత్వ తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్న విపక్షాలు, టిడ్కో గృహాలపై వాస్తవాలు, అభివృద్ధి వికేంద్రీకరణ, గ్రామ సచివాలయాల పనితీరు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

  • Loading...

More Telugu News