Tapsee: నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను: తాప్సీ

Tapsee says she does not tolerate rubbish talks
  • లాక్ డౌన్ కారణంగా ఆర్నెల్లు ఇంట్లోనే ఉన్న తాప్సీ
  • ఇటీవలే మాల్దీవుల్లో టూర్
  • ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ
అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమల్లోనూ నటిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న తాప్సీ లాక్ డౌన్ అనంతరం మాల్దీవుల్లో సేదదీరింది. ఇటీవలే భారత్ తిరిగొచ్చిన ఈ స్లిమ్ బ్యూటీ ఆసక్తికర అంశాలు వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో ఆర్నెల్లుగా ఇంటికే పరిమితం అయ్యానని, అందుకే మాల్దీవుల్లో ప్రకృతి అందాలను హాయిగా ఆస్వాదించానని వెల్లడించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నానని తెలిపింది.

అయితే, తన మనస్తత్వం గురించి చెబుతూ, సోషల్ మీడియాలో తాను ఎంతో చురుగ్గా ఉంటానని పేర్కొంది. తన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను అభిమానులతో పంచుకుంటానని, కానీ వేరొకరి వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లనని తెలిపింది. అయితే తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించబోనని, అలాంటి వ్యాఖ్యలు చేసేవారికి తనదైన శైలిలో బదులిస్తానని తాప్సీ స్పష్టం చేసింది.

కొంతమంది చేసే వ్యాఖ్యలు సవ్యంగానే ఉంటాయని, అలాంటి వాటితో తనకేమీ ఇబ్బందిలేదని, కొందరు ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారని, వారికి మాత్రం కౌంటర్ ఇస్తానని వివరించింది.
Tapsee
Trolls
Rubbish
Social Media
Tollywood
Kollywood
Bollywood

More Telugu News