Yogi Adityanath: మతాంతర వివాహాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న యోగి సర్కార్

Yogi govt decides to scrap 44 years old scheme

  • లవ్ జీహాద్ పై ఉక్కుపాదం మోపనున్న యోగి సర్కార్
  • 44 ఏళ్ల నాటి పథకానికి ముగింపు పలికేందుకు రంగం సిద్ధం
  • ఇప్పటికే మత మార్పిడులపై ఆర్డినెన్సు తీసుకొచ్చిన యూపీ ప్రభుత్వం

మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు స్కీములు అమల్లో ఉన్నాయి. యూపీలో కూడా 44 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఇటీవలి కాలంలో లవ్ జీహాద్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లవ్ జీహాద్ పేరుతో జరిగే మత మార్పిడులను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉంది. 1976లో తీసుకొచ్చిన పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యోగి సర్కార్ ఒక కీలకమైన ఆర్డినెన్సును జారీ చేసింది. మత మార్పిడులకు పాల్పడే వారికి పదేళ్ల కఠిన శిక్షను అమలుచేయనున్న ఆర్డినెన్స్ ను తెచ్చింది.  

ప్రస్తుతం ఉన్న పథకం ప్రకారం మతాంతర వివాహం చేసుకున్న వారు పెళ్లి జరిగిన రెండేళ్లలో జిల్లా మేజిస్ట్రేట్ కు దరఖాస్తు చేసుకుంటే... రూ. 50 వేల నగదు బహుమతి ఇస్తారు. గత ఏడాది 11 జంటలు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాయి. ఈ ఏడాది అన్ని దరఖాస్తులను పెండింగ్ లో ఉంచారు. వీటిని తిరస్కరించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News