sourav ganguly: అద్భుతంగా రాణించి భారత్‌ను గెలిపించిన పాండ్యా, జడేజాపై గంగూలీ ప్రశంసలు
- భారత జట్టులో వారిద్దరు కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారు
- సిరీస్ ఓడిపోయినప్పటికీ మూడో మ్యాచులో భారత్‌కు మంచి విజయం
- ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ మూడో వన్డేలో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన హార్ధిక్ పాండ్య 92, రవీంద్ర జడేజా 66 పరుగులతో అద్భుతంగా రాణించి టీమిండియా స్కోరును 300 దాటించిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా విజయలక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పాండ్యా, జడేజాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వారి ఆటతీరుపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... భారత జట్టులో వారిద్దరు దీర్ఘ కాలంలో కీలకమైన ఆటగాళ్లుగా అవతరిస్తారని తెలిపారు. సిరీస్ ఓడిపోయినప్పటికీ మూడో మ్యాచు రూపంలో భారత్‌కు మంచి విజయం దక్కిందని అన్నారు. ఇది సుదీర్ఘ పర్యటన కావడంతో ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. రెండు వన్డేల్లో ఆసీస్‌కు తగ్గట్లుగా రాణించని భారత్ మూడో వన్డేలో గెలవడంతో రేపటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీని తర్వాత ఆసీస్‌తో భారత్ టెస్టు సిరీస్ కూడా ఆడనుంది.