Bachula Arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి రెండోసారి కరోనా.. పరిస్థితి విషమం!

TDP MLC Bachula Arjunudu tests Corona positive for second time
  • ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది  
  • హైదరాబాదుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన చంద్రబాబు
  • ఆందోళనలో టీడీపీ శ్రేణులు
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు వేల మందికి పైగా ప్రజలు మరణించారు. వీరిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయనకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. నెగెటివ్ వచ్చాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి మహమ్మారి బారిన పడటంతో పరిస్థితి విషమించింది.

బచ్చులకు రెండోసారి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దీంతో, మెరుగైన చికిత్స అందించేందుకు ఆయనను హైదరాబాదుకు తరలిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. బచ్చుల ఆరోగ్యం విషమించిందనే వార్తలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Bachula Arjunudu
Corona Virus
Telugudesam
Chandrababu

More Telugu News