GHMC Elections: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ 23, టీఆర్ఎస్ 6 చోట్ల ఆధిక్యం

ghmc elections results

  • 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు
  • తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు
  • డివిజన్ల వారీగా పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఫలితాల ప్రకటన 
  • 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. తక్కువగా ఓట్లు పోలైన మెహిదీపట్నంలో మొదటి రౌండ్‌లోనే ఫలితం తేలనుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపును బట్టి బీజేపీ 23 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ ఆరు డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇతర పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు.

కాగా, ఈ నెల 1న 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 34,50,331 ఓట్లు పోలయ్యాయి. 1,926 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను అధికారులు జారీ చేశారు. మొదటి రౌండ్‌గా వీటిని తెరిచారు. డివిజన్ల వారీగా పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ఫలితాలను ప్రకటిస్తున్నారు.

  • Loading...

More Telugu News