dharmapuri arvind: తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైంది: గ్రేటర్ ఫలితాలపై బీజేపీ ఎంపీ అరవింద్

 it is clear message to TRS that people want change Arvind
  • దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇటీవల వెల్లడైన ఫలితాలను చూశాం
  • ఇప్పుడు జీహెచ్ఎంసీలో చూస్తున్నాం
  • సాయంత్రం వరకు ఈ ఫలితాలను పరిశీలించాల్సి ఉంది
  • ప్రజలు మార్పును కోరుకుంటున్నారని టీఆర్ఎస్‌కు తెలుస్తోంది
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మొదట అధికారులు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఇప్పటివరకు జరిగిన లెక్కింపుల్లో బీజేపీ 85, టీఆర్ఎస్ 29, ఎంఐఎం 17 డివిజన్లలో ఆధిక్యంలో ఉండడం పట్ల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని అన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఇటీవల వెల్లడైన ఫలితాలను చూశామని, ఇప్పుడు జీహెచ్ఎంసీలో చూస్తున్నామని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ ఫలితాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. అయితే, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని టీఆర్ఎస్‌కు స్పష్టమైన సందేశం వెళుతోందని చెప్పారు.
dharmapuri arvind
BJP
GHMC Elections

More Telugu News