Sensex: దూసుకుపోయిన మార్కెట్లు.. తొలిసారి 45 వేల మార్కును దాటిన సెన్సెక్స్
- 447 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 125 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 45 వేల మార్కును దాటింది. ఈరోజు ఆర్బీఐ ప్రకటించిన పరపతి విధాన ప్రకటనతో ఇన్వెస్టర్లు హుషారుగా ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 45,080కి ఎగబాకింది. నిఫ్టీ 125 పాయింట్లు పుంజుకుని 13,259 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (4.20%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.10%), సన్ ఫార్మా (3.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.85%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.77%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.74%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.34%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.17%), ఎన్టీపీసీ (-0.10%).