Vijayasai Reddy: బాబు వ్యవహారం చూస్తే కాపలాదారే చోరీకి పాల్పడ్డట్టుంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments in socila media
  • ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి
  • దేవాదాయ భూములు బినామీలకు రాశాడని ఆరోపణ
  • పెన్షన్ సొమ్ము పసుపు-కుంకుమలకు మళ్లించాడని వెల్లడి
  • అను'కుల మీడియా' అంటూ విసుర్లు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు వ్యవహారం చూస్తే కాపలాదారే చోరీకి పాల్పడ్డట్టుగా ఉందని  పేర్కొన్నారు. వందల ఎకరాల దేవాదాయ భూములను బినామీలకు రాసిచ్చాడని ఆరోపించారు. ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము సొమ్ము రూ.663 కోట్లను పసుపు-కుంకుమల కోసం మళ్లించాడని వెల్లడించారు. అను'కుల మీడియా' మాత్రం 'జయము జయము చంద్రన్నా' అంటూ జాకీలు పెట్టి లేపుతూనే ఉందని విజయసాయి వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
Comments
Twitter
Social Media
YSRCP
Andhra Pradesh

More Telugu News