Nara Lokesh: ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన నారా లోకేశ్

Nara Lokesh asks Centre to declare health emergency in Eluru
  • ఏలూరులో వింతరోగం
  • అంతకంతకు పెరుగుతున్న కేసులు
  • పరిస్థితి అదుపు తప్పుతోందన్న లోకేశ్
  • రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆరోపణ
  • కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలంటూ లేఖ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అర్థంకాని వింతవ్యాధి హడలెత్తిస్తోంది. వైద్యులు సైతం ఆ జబ్బుకు కారణాలేంటో చెప్పలేకపోతున్న నేపథ్యంలో ఏలూరు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.

ఏలూరులో పరిస్థితి దిగజారుతోందని, అక్కడ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కోరుతూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్షన్ కు లేఖ రాశారు. వందల మంది అస్వస్థతకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించడంలేదని ఆరోపించారు. ఏలూరు ప్రజలను కాపాడేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
Nara Lokesh
Health Emergency
Eluru
Decease
Letter
Centre
Andhra Pradesh

More Telugu News