Malla Reddy: మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు

Case filed against TRS minister Malla Reddy in land grabbing issue
  • మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసిన శ్యామలాదేవి అనే మహిళ
  • తన లాయర్ తో కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని ఫిర్యాదు
  • మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు భూకబ్జా కేసును నమోదు చేశారు. మేడ్జల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే... తన స్థలంలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని శ్యామలాదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన మహిళ. మల్లారెడ్డి  కబ్జా చేసిన భూమిని విడిపించాలని తాను ఓ లాయర్ ను సంప్రదించానని... ఆ లాయర్ తోనే మల్లారెడ్డి కుమ్మక్కయ్యారని, తప్పుడు పత్రాలను సృష్టించి భూమిని ఆక్రమించారని ఫిర్యాదులో తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 447, 506 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద మల్లారెడ్డిపై కేసు నమోదైంది.
Malla Reddy
TRS
Land Grabbing
Case

More Telugu News